Natyam ad

కూటమి మ్యానిఫెస్టోలో బిజెపి దూరం- మంత్రి పెద్దిరెడ్డి

– బాబు, పవన్‌ లదే మ్యానిఫెస్టో
– రాజధాని నిర్మిస్తామంటు లోకేష్‌ కలలు
– వైఎస్‌.జగన్‌ చేసేదే చెప్తారు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రానున్న ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తయారు చేసిన ఉమ్మడి మ్యానిఫెస్టోలో బిజెపి దూరంగా ఉందని, మ్యానిఫెస్టోలో బిజెపి ఫోటోలు కూడ లేవని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దెవ చేశారు. బుధవారం పట్టణంలోని హైస్కూల్‌వీధి , ఏవి.రావు వీధి, తాటిమాకులపాళెంలో ఎన్నికల ప్రచారాన్ని శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి లతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మ్యానిఫెస్టోను బిజెపి నిరాకరించినట్లు స్పష్టమౌతుందన్నారు. అమలు చేయలేని హామిలతో ప్రజలను మోసగించేందుకు పవన్‌, చంద్రబాబు తయారు చేసిన మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అధికారం వచ్చినట్లు , రాజధానిని నిర్మించినట్లు లోకేష్‌ పగటి కలలు కంటున్నాడని ఎద్దెవ చేశారు. రాజధాని పేరుతో భూదోపిడికి లోకేష్‌ స్కెచ్‌ వేస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను తూచతప్పకుండ అమలు చేస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టో, భగవత్‌గీత, ఖురాన్‌ , బైబిల్‌ లాంటి పవిత్రమైన గ్రంధాలుగా భావించి మ్యానిఫెస్టోను జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండ అమలు చేస్తారని తెలిపారు.

 

 

ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కులమతాలకు , పార్టీలకతీతంగా పేదరికమే ప్రామాణికంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన కొనసాగించారని , సచివాలయ వ్యవస్థను, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, 108, 104 లను ఆదర్శంగా తీసుకుని పలు  రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రజలలో మతతత్వ ధోరణి పెరిగి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మంత్రి తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. రానున్న ఐదేళ్లలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎంతో గొప్పగా సాగుతుందో మరో సారి గమనించాలన్నారు. మాట చెప్పితే మడమ తిప్పకుండ ప్రజలను ఆదుకుంటున్న ఏకైక నాయకుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతి ఒక్కరు గమనించి ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; BJP distance in Kootami Manifesto- Minister Peddireddy

 

Post Midle