మైనార్టీలకు సహాయం చేసేందుకు బిజెపికి మనసు లేదు – మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
– సీఎం హజ్ యాత్రకు నిధులు కేటాయించారు
– హజ్‌యాత్ర విజయవంతం కావాలి
– త్వరలోనే ఉర్ధూకళాశాల ఏర్పాటు
పుంగనూరు ముచ్చట్లు:

ముస్లిం మైనార్టీలకు సహాయం చేసేందుకు బిజెపి ప్రభుత్వానికి మనసులేదని , దానిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హజ్‌యాత్రకు సుమారు రూ.15 కోట్లు విడుదల చేసి హాజీల ఖాతాలలోకి రూ.80 వేలు జమ చేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం ఆధ్వర్యంలో హజ్ ప్రయాణికులకు శిక్షణా , వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర హజ్‌కమిటి చైర్మన్ గౌస్‌వెహోహిద్దిన్, మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహమ్మద్‌లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి హజ్‌యాత్రకు వెళ్తున్న వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అలాగే హజ్‌కమిటి చైర్మన్‌ను సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ నుంచి హజ్‌యాత్రకు వెళ్లడం చాలా కష్టతరమైందన్నారు. దీనిని గుర్తించిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీలకు సౌకర్యం కల్పించేందుకు కేంద్ర మంత్రిని కలవాలని ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డికి సూచించారన్నారు. కానీ కేంద్ర మంత్రి స్పందించకపోవడంతో ఆ ఆర్థిక భారాన్ని మన ప్రభుత్వం భరించి, మైనార్టీలకు అండగా నిలిచిందన్నారు. మైనార్టీలందరికి ఆర్థిక సహాయం అందిస్తూ విజయవాడ నుంచి అన్ని సౌకర్యాలతో నేరుగా హజ్‌యాత్రకు వెళ్లే సౌకర్యం చేశారన్నారు. మైనార్టీలకు ఎన్నడు లేని గుర్తింపును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చి వారిని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. మైనార్టీలకు ఏకష్టం వచ్చిన తాము తీర్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
ఉర్ధూ కళాశాల ఏర్పాటు…..
మైనార్టీ విద్యార్థుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఉర్ధూ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే ఉర్ధూకళాశాల ఏర్పాటు చేసి ముస్లిం మైనార్టీల ఉన్నత విద్యకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర హజ్‌కమిటి డైరెక్టర్ ఖాదర్, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, మైనార్టీ నేతలు ఎంఎం.సాదిక్, నూరుల్లా, మస్తాన్, అజీజ్‌సాహెబ్, షామీర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలోనే మైనార్టీల అభివృద్ధి…
రాష్ట్రంలో మైనార్టీలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర హజ్‌కమిటి చైర్మన్ గౌస్‌వెహోహిద్దిన్ అన్నారు. ప్రస్తుతం హజ్‌యాత్ర ముస్లింలకు ఎంతో ముఖ్యమైన ఘట్టమన్నారు. దానిని సందర్శించేందుకు ప్రభుత్వం సుమారు 2500 మందికి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. మైనార్టీలందరు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ ఇక్భాల్ అహమ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీలకు గుర్తింపు ఇచ్చారని తెలిపారు. జిల్లాలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధిక పదవులు మైనార్టీలకు కేటాయించారని కొనియాడారు.
Tags; BJP has no heart to help minorities – Minister Dr Peddireddy Ramachandra Reddy
