బీజేపీకి మాట్లాడే అర్హత లేదు
విజయవాడ ముచ్చట్లు:
ఏపీ విషయంలో బీజేపీకి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్… రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందన్నారు.. ఇక, స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. రాహుల్ యాత్రతో ప్రజలల్లో మార్పు కనిపిస్తోంది. ప్రజలలో నమ్మకం, ఆదరణ పెరుగుతోందన్న ఆయన.. బీజేపీకి మాట్లాడే అర్హతేలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికే మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు.. ప్రభుత్వ ఆస్తుల కబ్జా తప్పా ఇంకొకటి తెలియదు అంటూ అధికార పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు గుప్పించారు.బీజేపీని ఎదిరించలేని అసమర్థ ప్రభుత్వాలున్నాయని విమర్శలు గుప్పించారు శైలజానాథ్.. ప్రధాని నరేంద్ర మోడీని అడిగే దమ్ము ఎవరికీ లేదన్న ఆయన.. ప్రజలు ఆలోచించుకోవాలి.. రాయలసీమ, ఉత్తరాంధ్రకు దిక్కులేకుండా పోయింది… ప్రభుత్వ గురించి మాట్లాడే అభిప్రాయ స్వేచ్ఛ, నిరసన తెలిపే రాజ్యాంగ హక్కులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రజలు ఆలోచించి మార్పుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ శైలజానాథ్.. కాగా, భారత్ జోడో యాత్ర.. ఏపీలో రెండు విడతల్లో సాగింది.. చివరకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత.. తుంగభద్ర బ్రిడ్జిపై ఏపీ నుంచి మళ్లీ కర్ణాటకలో అడుగుపెట్టారు రాహుల్ గాంధీ.. ఇక, భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.
Tags: BJP has no right to speak

