Natyam ad

మన ప్రభుత్వాన్ని బిజెపి కాపికొడుతోంది – మంత్రి పెద్దిరెడ్డి

– స్థానికులకు ఉద్యోగాలు

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన , సంక్షేమ పథకాలను చూసి బిజెపి , తదితర పార్టీలు కూడ కాపిలు కొడుతూ మన విధానాలను అమలు పరుస్తామని, ఎన్నికల హామి ఇస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండల సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల సమావేశాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్పలు హాజరైయ్యారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సచివాలయాలు, ఆర్‌బికెలు ఏర్పాటు చేసి ఒక్కసారిగా సుమారు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అవినీతికి తావులేకుండ కల్పించడం జరిగిందన్నారు. ఈ ఘనత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. ఇదే విధానాన్ని బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి , స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందన్నారు. ఈవిధంగా వినూత్న పథకాలతో ప్రజలను అన్ని విధాల ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. పలు దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన వ్యవస్థలు, పథకాలపై అధ్యయనాలు చేయడం జరుగుతోందన్నారు. చంద్రబాబునాయుడు రుణాలుమాఫి అంటు మహిళలను, రైతులను మోసగించారన్నారు. ఆయన ఎన్నికల మ్యానిఫెస్టోను కూడ దాచేశారని ఎద్దెవా చేశారు. ఏముఖ్యమంత్రి చేపట్టని అభివృద్ధి కార్యక్రమాలను మన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్నారని తెలిపారు. పదినెలల తరువాత ఎన్నికలు రాబోతుందని మంత్రి తెలిపారు. ఆ సమయంలో అందరు ఐకమత్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలని కోరారు. రెండవ సారి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెట్టింపు మేలు చేస్తారని, దీనిని ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, సచివాలయాల కన్వీనర్‌ చెంగారెడ్డి ,ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నాతరపున మీరే చేయాలి…

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 64 నియోజకవర్గాలలో పార్టీ బాధ్యతలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇలాంటి సమయంలో నాతరపున ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, గృహసారధులు, కన్వీనర్లు, నా శ్రేయోభిలాషులు కష్టపడి పని చేసి నాకు సహాయం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు.

  

Tags:BJP is destroying our government – Minister Peddireddy