బీజేపీ భీష్ముడికి అంతిమ వీడ్కోలు

BJP is the ultimate farewell to Bhishma

BJP is the ultimate farewell to Bhishma

Date:17/08/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర బీజేపీ జాతీయ కార్యాలయం నుంచి శక్తి స్థల్  వరకు సాగింది. శుక్రవారం ఉదయం వాజ్‌పేయి భౌతికకాయాన్ని కృష్ణమీనన్ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి బీజేపీ జాతీయ కార్యాలయానికి తరలించారు. బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర యమునా నది ఒడ్డున్న స్మృతి స్థల్‌ వరకు సాగుతుంది.
సాయంత్రం అక్కడే వాజ్‌పేయి పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.అశేష జనవాహిని మధ్య వాజ్‌పేయి అంతిమయాత్ర సాగుతోంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, నేతలు, బీజేపీ కార్యకర్తలు కన్నీటితో కర్మయోగికి వీడ్కోలు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, హోం మంత్రి రాజ్‌నాథ్.. వాజ్‌పేయి అంతిమయాత్ర రథం వెంటే ముందుకు సాగుతుండగా.. దారి పొడవునా ‘అటల్ జీ అమర్ రహే’ నినాదాలు హోరెత్తుతున్నాయి.
భారీగా తరలివచ్చిన అభిమానులతో హస్తిన వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. దారులన్నీ స్మృతి స్థల్‌ వైపే సాగుతున్నాయి.ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు అటల్‌జీ అంతిమయాత్ర ప్రారంభమైంది. బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి భౌతికకాయానికి ప్రధాని మోదీ, పార్టీ సీనియర్ నేత ఎల్‌‌కె అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు, అమిత్‌ షా తదితరులు నివాళులు అర్పించారు.
అనంతరం ప్రారంభమైన అంతిమయాత్ర వెంట ప్రధాని మోదీ, అమిత్ షా ముందుకుసాగుతున్నారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వం లాంఛనాలతో అటల్‌జీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భరత మాత ముద్దు బిడ్డ, భారత రత్న, దేశానికి విశేష సేవలందించిన వాజ్‌పేయి ఇక యమునా నదీ తీరాన శాశ్వతంగా సేద తీరనున్నారు. నెహ్రూ స్మారక స్థలం ‘శాంతి వనం‘, లాల్‌బహుదూర్‌ శాస్త్రి స్మారకం ‘విజయ్‌ ఘాట్‌’ మధ్యలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్‌ అంత్యక్రియలు కూడా స్మృతి స్థల్‌లోనే జరిగాయి.
ప్రత్యర్థులు, శత్రు దేశాలతోనూ ప్రశంసలు అందుకున్న మహానేత వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు విదేశీ నేతలు కూడా తరలిరావడం విశేషం. పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జాఫర్‌, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ హసన్‌ మొహమ్మద్ అలీ, భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌, నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, గ్యావల్, శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కిరిల్లా సైతం వాజ్‌పేయి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వీరంతా అటల్ జీ అంత్యక్రియల్లో పాల్గొనడానికి స్మృతి స్థల్‌ చేరుకున్నారు.
భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌, నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, గ్యావల్, శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కిరిల్లా, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌ సైతం వాజ్‌పేయి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వీరంతా అటల్ జీ అంత్యక్రియల్లో పాల్గోనున్నారు. గత జూన్ 11 నుంచి తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5.05 గంటలకు వాజ్‌పేయి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని నిన్న సాయంత్రం ఎయిమ్స్‌ నుంచి కృష్ణమీనన్‌ మార్గ్‌లోని నివాసానికి తరలించారు.
బంధువులు, ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ, కేరళ, తమిళనాడు గవర్నర్లు ఈఎస్ఎల్ నరసింహన్, పి.సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు.
Tags:BJP is the ultimate farewell to Bhishma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *