చీరాల లో బీజేపీ, జనసేన నిరసన

Date:24/09/2020

చీరాల ముచ్చట్లు

ప్రకాశం జిల్లా చీరాల తాశిల్దార్ కార్యాలయం వద్ద బీ జె పీ.,జనసేన పార్టీల ఆధ్వర్యంలో మంత్రి కొడాలి నాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , యు పీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ దాస్ ల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చీరాల పట్టణ బీ జె పీ అధ్యక్షులు అరవపల్లి కుమార్ మాస్ట్లాడుతూ,మంత్రి కొడాలి నాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం, ఎన్నో విగ్రహాలను పగులకొట్టారు చేతులు విరగ కొట్టారు.దుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైనాయి అనంటే మహాయితే నాలుగు లేదా ఆరు లక్షల రూపాయలు అవుతాయి అనడం చాలా బాధాకరం అయిన విషయం, మోడీపైనా, యోగి పైన ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఆయనను వెంటనే మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని కోరుతున్నాం అని తెలిపారు.
జనసేన నాయకులు గుడూరి శివరామ ప్రసాద్ మాట్లాడుతూ,కొడాలి నాని ని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని అదేవిధంగా శ్రీవారి దర్శనం లో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని ఉండగా ఆయన హిందువో కాదో ఆయన విఘ్నతకే వదలి వేస్తున్నామని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన నాని ని మంత్రి వర్గం నుండి తొలగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మువ్వల వెంకటరమణ,పింజల భరణి తదితరులు పాల్గొన్నారు.

 ఆన్ లైన్ సేవలు పునరుద్ధరించాలి

Tags:BJP, Janasena protest in sarees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *