Date:05/12/2020
విజయవాడ ముచ్చట్లు:
నూజివీడు పట్టణంలో అధ్వానంగా తయారైన రోడ్లు మరమ్మతులు చేయాలంటూ పట్టణ పుర వీధుల్లో బిజెపి, జనసేన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్, చిన్న గాంధీ బొమ్మ, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లు మీదుగా రోడ్లవెంబడి చిరు వ్యాపారుల దగ్గర సంతకాల సేకరణ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి, గుంటలు పడిన రోడ్లు వెంటనే పూడిపించి ప్రజల ప్రాణాలు కాపాడండి. దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయించండి. కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి అంటూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. తరువాత వారు సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేసారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి
Tags: BJP, Janasena rally in Noojeedu