Natyam ad

బీజేపీ నేత దారుణ హత్య

జగ్గయ్యపేట ముచ్చట్లు:
 
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ నాయకుడు మల్లారెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పార్టీ కార్యక్రమాల కోసంబైక్‌పై వెళ్తుండగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం చిట్యాల
వద్ద ముందుగా కారుతో ఢీకొట్టి అతన్ని చంపాలని దుండగులు ప్రయత్నించారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్న మల్లారెడ్డిని వెంటాడి కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు.రెండురోజులుగా
మల్లారెడ్డి కదలికలను పసిగట్టిన దుండగులు ఈరోజు హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అయితే హత్యకు గల కారణాల
గురించి వాకబు చేస్తున్నారు.
 
Tags: BJP leader brutally murdered