Natyam ad

శ్రీవారిని దర్శించుకున్న  బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీవారిని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. కరోనా త్వరగా అంతమవ్వాలని స్వామిని కోరుకున్నా. ఎపి ప్రభుత్వం తీసుకున్న
వివాదస్పద నిర్ణయాల వల్ల పేద ప్రజలు అట్టడుగుకు వెళ్లి పోతున్నారు. సామాన్యుడు నేడు ఇసుక,స్టిల్. సిమెంట్ కొనే పరిస్థితిలో లేదు. సినిమా టికెట్లు ధరలు కాదు కనీస అవసర వస్తువుల ధరలు
తగ్గించేలా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలోనే ఏ రాష్ట్రానికి ఈ రకమైన పరిస్థితి లేదు. ఆదాయ వనరులు పెంచే విషయంలో ప్రభుత్వం విఫలం అయింది. ఒక
చేత్తో ఓటు బ్యాంకు కు తాయిలాలూ వేస్తూ మరో చేత్తో నిత్యవసర సరుకుల ధరలు పెంచుతున్నారు. గడిచిన 30 నెలలు  రాష్ట్రాన్ని ప్రభుత్వం  తిరోగమనం వైపు తీసుకు వెళ్లింది. ఉన్న 30 నెలలు అవకాశం
ఉన్న ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్లాలి.  వచ్చే ఎన్నికల్లో బీజేపీ,జనసేన కలిసి పోటీ చేతిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలియ చేశారు.  అన్ని రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా మైనియం
పాలిటిక్స్ చేస్తున్నాయి ఆయన స్పష్టం చేశారు.  మాత్రమే రాబోయే రోజుల్లో బిజెపి,జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తుంది. వన్, సైడ్ లవ్,టు సైడ్ లవ్ అని ఆశలు పెట్టుకున్న వ్యక్తులకు పవన్ నిర్ణయంతో
స్పష్టం అయింది అనుకుంటున్నాం.  2024 లో బిజెపి,జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ బాగు పడుతుంది. బిజెపి,జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మా జాతీయ పార్టీ నిర్ణయం
తీసుకుంటుందని అయన అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: BJP leader Vishnuvardhan Reddy visiting Srivastava