తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు

మేడిపల్లి   ముచ్చట్లు :
మేడిపల్లి మండల కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని
బీజేపీ నాయకులు పరిశీలించారు.శుక్రవారం
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు మేడిపల్లి మండల కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ,ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు తూకంలో కూడా 40 కిలోలకు బదులు 43 కిలోలు మూడు కిలోలు అదనంగా జోకుతున్నారని ,రైతులు ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన పంటని రైతుల శ్రమని దోచుకుంటున్న ప్రభుత్వానికి మంచిది కాదని వేములవాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ క్యాతం దశరథ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం చేశారు.
ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల బీజేపీ  అధ్యక్షులు ముంజ శ్రీనివాస్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు ముకిలీ ఇశ్రాయేల్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ ఎన్ రెడ్డి, యువ మోర్చా మండల అధ్యక్షులు గోస్కి మధు, రఘు శంకర్ ,గణేష్, రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:BJP leaders examining the tainted grain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *