కాకర్ల కు ఘన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

దర్శి ముచ్చట్లు :

ప్రకాశం జిల్లా దర్శి లో  ఇటీవల మరణించిన దర్శి బీజేపీ  సీనియర్ నాయకులు కాకర్ల ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షులు సిర్సనగండ్ల శ్రీనివాసులు కాకర్ల ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి  శ్రీనివాసులు మాట్లాడు తూ కాకర్ల ఆంజనేయులు  కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కాకర్ల మృతి దర్శి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీకి తీరనిలోటని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం  జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు  తిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ  కాకర్ల  ఆంజనేయులు   పార్టీకి తుది శ్వాస వరకు పనిచేశారని కొనియాడారు. దర్శి నియోజకవర్గ  బీజేపీ ఇంచార్జి మాడపాకుల  శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా తీరనిలోటని వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరం  రెడ్డి నాగిరెడ్డి,  జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు తదితరులు  పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:BJP leaders pay solid tributes to Cockers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *