బిజెపి అంటే..  ” భారతీయ ఝటా పార్టీ “

Date:23/10/2020

సిద్దిపేట ముచ్చట్లు:

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం లో మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. గ్రామస్థులు అయనకు  బతుకమ్మ, బోనాలు,  మంగళహారతులు,  డప్పు చప్పుళ్ళతో ఘనస్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ  బిజెపి అంటే..  ” భారతీయ ఝటా పార్టీ “.  కాంగ్రెస్ ఓటేస్తే కాలిపోయే మోటార్లు.. బిజెపి కి ఓటేస్తే బాయి కాడా మోటార్లు.  ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్.  కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనని అన్నారు.
ఆనాడు కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉండకపోవు.  కెసిఆర్ హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు.  రైతు చనిపోతే.. రూ. 5లక్ష్మల భీమా ఇస్తున్నాం.  పెన్షన్ ల మీద చర్చకు బస్టాండ్ కు రమ్మన్నా బండి సంజయ్ ఇప్పటివరకు పత్తాలేడు.  బీజేపీ వాళ్ళు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు.  తెలంగాణ వచ్చినంక.. 1.24లక్ష్మల ఉద్యోగాలు ఇచ్చాం.  బీజేపీ ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని అన్నారు.
దుబ్బాక ను రాబోయే రోజుల్లో అన్నీ రకాల్లో అభివృద్ధి చేసుకుందాం.  బీజేపీ, కాంగ్రెస్ వాళ్ల ఇండ్లు తెలియదు.. కానీ, ఆటో ఎక్కితే..  హరీష్ రావు ఇంటి కాడ దించుతాడు. ఉత్తమ్, బండి సంజయ్ కు ఎంఎరుక.. రాజక్కపేట కష్టాలని మంత్రి వ్యాఖ్యానించారు.

రైతుల ఆరెస్టు

Tags: BJP means “Bharatiya Oota Party”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *