బీజేపీ ఎమ్మెల్యేల హౌస్ ఆరెస్టు

Date:17/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
బీజేపీ ఎమ్మెల్యేలు నేతలు కిషన్రెడ్డి, రామచంద్రారావులను పోలీసులు మంగళవారం ఉదయం  హౌస్ అరెస్ట్ చేశారు. పరిపూర్ణనంద స్వామి పై నగర బహిష్కరణ ఎత్తి వేయాలని బిజేపి ఎమ్మెల్యేలు ఛలో ప్రగతి భవన్ పిలుపునిచ్చారు. సిఎం కేసిఆర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలంతా బిజేపి ఆఫీసులు రావాలని సూచించారు.  దాంతో కాచిగూడలోని కిషన్రెడ్డి, తార్నాకలోని రామచంద్రరావులను వారి ఇళ్లలో పోలీసులు గృహ నిర్బంధించారు. ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ పిలుపు మేరకు మధ్యాహ్నం  బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు భేటీ కావాలని నిర్ణయించారు. బీజేపీ కార్యాలయం నుంచి ప్రగతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఎం కేసీఆర్కు వినతిపత్రం సమర్పించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. బీజేపీ నేతల నిర్ణయంతో పోలీసులు కిషన్రెడ్డి, రామచంద్రరావులను హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. స్వామి పరిపూర్ణానంద బహిష్కరణను వెంటనే ఎత్తేయాలని, ప్రగతి భవన్ వరకు ర్యాలీ చేసే ర్యాలీని అడ్డుకోవాలని చూడడం సిగ్గు చేటు అన్నారు. కేసీఆర్ను కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఇంట్లో కూర్చోపెడతారని కామెంట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేల హౌస్ ఆరెస్టు https://www.telugumuchatlu.com/bjp-mlas-house-is-the-same/
Tags:BJP MLA’s house is the same

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *