Natyam ad

బిజేపీ ఎం.పి దిష్టి బొమ్మ దగ్ధం

విశాఖపట్నం ముచ్చట్లు:


ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద మహిళా రెజ్లర్ల పోరాటానికి సంఘీభావంగా ఏపీ మహిళా సమాఖ్య , అఖిల భారత యువజన సమాఖ్య , అఖిల భారత విద్యార్థి సమాఖ్యల అధ్వర్యంలో రెజ్లర్ల ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు.  భారత దేశానికి స్వర్ణ, సిల్వర్ పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లు లను ఉత్తరప్రదేశ్ ఎం.పి & రెజ్లర్ల ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ప్రధానికి, క్రీడా రంగానికి సంభదించిన అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవటం తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 18రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తూ న్యాయం కోసం పోరాటం చేస్తున్నా వారిపై ఢిల్లీ పోలీస్ వారు మధ్యం సేవించి వారిపై దాడులు చేయటం హేయమైన చర్యగా ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి అత్తిలి విమల అభివర్ణించారు. అలాగే బిజేపీ అదికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలొ మరియు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆర్. ఎస్ ఎస్ , విశ్వహిందూ పరిషత్ , బిజెపి ప్రతినిధులు మహిళలపై లైగింక దాడులు,హత్యలు విపరీతంగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Tags; BJP MP Dishti doll burnt

Post Midle
Post Midle