ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గా బీజేపీ-ఎంపీ జీవిఎల్
విశాఖపట్నం ముచ్చట్లు:
వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని అది టిడిపి అవు తందనే భ్రమలు వద్దని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నారు.ఏపీ రాష్ట్ర ప్రజలు వైసీపీని గెలిపించి తప్పు చేశారని.. ఆ తప్పుడు నిర్ణయం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.వైసీపీ, టీడీపీని ఓడించడమే తమ లక్ష్యమని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు.బీజేపీ, జనసేన కలిసే ముందుకు వెళ్తాయని,వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు.వైజాగ్ ఇన్ఫోకస్ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడతా నని, పద్మ అవార్డులు ఆంధ్రప్రదేశ్కు రావడం ఆనందంగా ఉందని జీవీఎల్ పేర్కొన్నారు.
Tags: BJP-MP GVL as an alternative political force in AP

