బీజేపీ ఎంపి ని అరెస్టు చేయాలి
విశాఖపట్నం ముచ్చట్లు:
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు బీజేపీ యం.పి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.నరసింగ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఢల్లీిలోని జంతర్ మంతర్ వద్ద గత ఐదు రోజుల నుండి రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి సంఫీుభావంగా విశాఖ జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద విశాఖజిల్లా సిఐటియు, ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్.ఎఫ్.ఐ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి.
ఈ కార్యక్రమంలో నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ యం.పి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇంత వరకు ఆయనపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకపోవడం దురదృష్టకరమన్నా రు. దేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుల పట్ల బిజెపి వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తమపై అనైతిక చర్యలకు పాల్పడ్డాడని, తమను అగౌరవపరిచే విధంగా వ్యవహరిం చారని రెజ్లర్లు ఫిర్యాదు చేయాల్సిరా వడం చాలా ఆందోళకరమైన అంశం. క్రీడాకార్లుపై లైంగిక దాడి చేసిన అధికార పార్టీ ఎంపి, డబ్యు.ఎఫ్.ఐ ఛీప్ మోడీ ప్రభుత్వం కాపాడుతోందని దుయ్యబట్టారు.

Tags: BJP MP should be arrested
