బీజేపీ.. ‘నమో మర్చండైజ్’

BJP .. 'Namo Merchandise'

BJP .. 'Namo Merchandise'

Date:09/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
బీజేపీ.. ‘నమో మర్చండైజ్’ను సద్వినియోగం చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. NaMo అంటే నరేంద్ర మోదీ అని అర్థం. నమో మర్చండైజ్ అనేది బీజేపీ ప్రచార వస్తువులను తయారు చేసే వాణిజ్య సంస్థ. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సంస్థ ‘NaMo Again’ పేరుతో వస్తువులను తయారు చేస్తోంది. ఈ సందర్భంగా NaMo Again అని రాసిన టీషర్టులు, టీ కప్పులు, మగ్గులు, పుస్తకాలు, పెన్‌లు, కీ ఛైన్లు, క్యాప్‌లు ఇలా అనేక వస్తువులను తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. మళ్లీ మోదీయే అధికారంలోకి రావాలని కోరుకునే వ్యక్తులు తమ వస్తువులు వాడాలని ప్రచారం చేస్తోంది.  ఇటీవల ఎంపీ అనురాగ్ ఠాకూర్ ‘నమో ఎగైన్’ అని రాసి ఉన్న టీషర్టును ధరించి పార్లమెంట్‌కు వెళ్లిన ఫొటోను నమో ఎగైన్ మర్చండైజ్ ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘బాగున్నావు అనురాగ్ ఠాకూర్’ అని కామెంట్ చేశారు. దీంతో అందరి దృష్టి ఆ టీ షర్ట్‌పై పడింది. అప్పటి నుంచి బీజేపీ అభిమానులు ‘నమో ఎగైన్’ పేరుతో ఉన్న ఇతర వస్తువులు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘నమో ఎగైన్’ వస్తువుల ద్వారా బీజేపీకి బోలెడంత ప్రచారం లభిస్తుందని నేతలు భావిస్తున్నారు.
Tags:BJP .. ‘Namo Merchandise’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *