బీజేపీ సన్నాహక సమావేశం

Date:17/09/2020

నల్గోండ ముచ్చట్లు:

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల నేపధ్యంలో బీజేపీ సన్నాహక సమావేశం జరిగింది.గురువారం నాడు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు,  మాజీ శాసన సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాజరైయ్యారు. ఎన్నికల గురించి పూర్తిగా విశ్లేషించి ఎలా ఎన్ రోలెమెంట్  చేసుకోవాలి, ఓటర్లను ఎలా ఆకర్షించుకోవాలి,  కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి పూర్తిగా వివరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లాలని దిశ నిర్దేశం చేసారు.  ఈ కార్యక్రమం  భాజపా రాష్ట్రా ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మాజీమంత్రి పెద్ది రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్,  జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి,  మాజీ జిల్లా అధ్యక్షుడు  నూకల నరసింహ రెడ్డి, తదితర రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వాన్ని సన్మార్గంలో నడిచేలా ఆ భగవంతుడే చర్యలు చేపట్టాలి

Tags:BJP preparatory meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *