Natyam ad

చినజీయర్ స్వామిని కలుసుకున్న బిజెపి అగ్రనేత ఏపీ జితేందర్ రెడ్డి బృందం

– రామానుజార్యుడి సహస్రాబ్ది వేడుకలకు ప్రధాని మోడీ రావడం విశేషం
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
విశిష్టాద్వైత తత్త్వవేత్త, వైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవత్ రామానుజాచార్యులు వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమని చాటిచెప్పిన మహాయోగి అని ఆయన ప్రజల ఆరాధ్యులని రామానుజార్యుల సహస్రాబ్ది వేడుకల్లో దేశంలోనే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతలలో చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో సువర్ణ శోభితంతో 150 కిలోల పసిడితో రూపొందించిన రామానుజులవారి 216 అడుగుల విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండటంతో జితేందర్ రెడ్డి, ఆయన తనయుడు ఏపీ మిథున్ రెడ్డి, షాద్ నగర్ నాయకులు పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి, పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి, భాస్కర్, ఆకుల ప్రదీప్, శ్యామ్ సుందర్ రెడ్డి, మోహన్ సింగ్ తదితరులు శ్రీత్రిదండీ చిన్న జీయర్ స్వామిని ఆశ్రమంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ పర్యటన విశేషాలని వాకబు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయా దేశాల నిపుణులతో త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ఆశ్రమంలో అత్యాధునిక పరిజ్ఞానంతో రామనుజుల స్వామి విగ్రహాన్ని తయారు చేశారని తెలిపారు.  విగ్రహ ప్రత్యేకతలను వివరిస్తూ..
 
 
రామానుజాచార్యులవారి బంగారు విగ్రహం ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు ఉంటుందని, విగ్రహం కింద మూడు అడుగుల పీఠం ఉంటుందని 1800 కిలోల రాగితో చేసిన రామానుజ విగ్రహానికి రెండు మిల్లీమీటర్ల సాంద్రత ఉన్న బంగారు తొడుగును అమరుస్తారని తెలిపారు. అదేవిధంగా 216 అడుగుల విగ్రహం వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని పేర్కొన్నారు. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి రోజూ ఆరాధన చేయటానికి, శుద్ధ జలాలతో అభిషేకాలు చేయటానికి చిన్నజీయర్‌ స్వామి ప్రణాళిక రూపొందిస్తున్నారని, నిత్యం ఆరాధనలు అందుకున్నా ఏ మాత్రం జిలుగు తగ్గకుండా ఉండేలా దీనిని రూపొందిస్తున్నారని, ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామివైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవత్ రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా  నెలకొల్పనున్న ఆయన భారీ పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆహ్వానించిన నేపద్యంలో ఆశ్రమాన్ని సందర్శించినట్టు ఆయన తెలిపారు. అనంతరం పలువురు జీయర్ స్వామి ఆశీస్సులు పొందారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: BJP top leader AP Jitender Reddy’s team meets Chinnajir Swamy