శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం-ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి.
నల్గోండ ముచ్చట్లు:
శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. సమావేశాలకు గవర్నర్ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు.. శాసనసభ ప్రొరోగ్ గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుటిల యత్నాలను తిప్పికొడతామన్నారు. బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజయ్ అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆపార్టీ దేశంలో నికృష్ట విధానాలను అమలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కేంద్రానికి ముందస్తు ఆలోచన లేదని విమర్శించారు.
గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్, బీజేపీలు నిర్వీర్యం చేశాయని, గవర్నర్ పాత్రను రాజకీయంగా పరిమితం చేశాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత వారికి లేదన్నారు.
Tags:BJP unnecessary rhetoric on Assembly sessions-MLC Gutta Sukhender Reddy