ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ పై బిజెపి కొరడా

BJP whips MP Sadhvi Pragya Singh

BJP whips MP Sadhvi Pragya Singh

Date:28/11/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బీజేపీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు వేసింది. ఢిఫెన్స్ ప్యానల్ నుంచి కూడా ఆమెను తొలగించింది. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కానీయకుండా చూసుకోవాలంటూ హెచ్చరికలు చేసింది.సాధ్వి వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తున్నట్టు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఇలాటి వ్యాఖ్యలకు తమ పార్టీ ఎప్పుడూ మద్దతీయదని స్పష్టం చేశారు. కాగా, బీజేపీ క్రమశిక్షణా కమిటీ నుంచి కూడా సాధ్విని బహిష్కరించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపారు. గత లోక్‌సభ భోపాల్ నియోజవర్గం నుంచి ఎంపీగా సాధ్వి గెలిచారు. మహాత్మాగాంధీ హంతకుడైన గాడ్సేను దేశభక్తుడంటూ గతంలోనూ వ్యాఖ్యానించి ఆమె తీవ్ర వివర్శలు ఎదుర్కొన్నారు.బుధవారం లోక్‌సభలో ఎస్‌పీజీ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ.రాజా చర్చలో పాల్గొంటూ గాంధీ హంతుకుడైన గాడ్సే పేరు ప్రస్తావించినప్పుడు సాధ్వీ అడ్డుకున్నారు. ‘ఒక దేశభక్తుడిని ఉదాహరణగా చెప్పడం ఏమిటి?’ అంటూ నిలదీయడంతో విపక్ష సభ్యులు మూకుమ్మడిగా నిరసన తెలిపారు. సాధ్వికి బీజేపీ ఎంపీలు నచ్చజెప్పి సీట్లో కూర్చోవాలని కోరడం సభలో చోటుచేసుకుంది. దీంతో రాజా వ్యాఖ్యలు మాత్రమే రికార్డుల్లో చేరుస్తామని స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రకటించారు.

ప్ర‌జ్ఞా సింగ్ వ్యాఖ్యలపై లోక్‌స‌భ‌లోదుమారం..కాంగ్రెస్ ఎంపీల వాకౌట్

వివాదాస్ప‌ద బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ థాకూర్‌ను ఉగ్ర‌వాదిగా పోలుస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఉగ్ర‌వాది ప్ర‌జ్ఞా థాకూర్ మ‌రో ఉగ్ర‌వాది గాడ్సేను దేశ‌భ‌క్తుడంటూ కామెంట్ చేశార‌ని రాహుల్ త‌న ట్వీట్‌లో విమ‌ర్శించారు. భార‌త పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లో ఇది అత్యంత దుర్దినం అన్నారు. బుధ‌వారం లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ ఎంపీ ప్ర‌జ్ఞా వ్యాఖ్యానించారు. దీనిపై ఇవాళ స‌భ‌లో దుమారం లేచింది. ఈ అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి. కానీ స్పీక‌ర్ ఓం బిర్లా చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఉగ్ర‌వాదంతో ఎలా పోల్చార‌ని అధిర్ రంజ‌న్ చౌద‌రీ అంత‌క‌ముందు ప్‌్శ్నించారు. వేలాది మంది నేత‌ల‌ను ఇచ్చిన పార్టీని ఇలా అంటారా, అస‌లు ఏం జ‌రుగుతోంది, స‌భ‌లో అంద‌రూ మౌనంగా ఉంటారా అని ఆయ‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స‌భ‌లో మాట్లాడుతూ ప్ర‌జ్ఞా వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. మ‌హాత్మా గాంధీ బోధ‌న‌లు త‌మ‌కు ఎంతో స్పూర్తినిచ్చాయ‌న్నారు. రాజ‌కీయ‌వేత్త‌లు గాంధీని ఆద‌ర్శంగా తీసుకుంటార‌న్నారు.

 

ఏపీఎండీసీ ద్వారానే ఇసుక అమ్మకాలు

 

Tags:BJP whips MP Sadhvi Pragya Singh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *