Natyam ad

టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ గెలుపు

హైదరాబాద్, ముచ్చట్లు:

హైదరాబాద్‌‌‌‌–రంగారెడ్డి- – మహబూబ్‌‌నగర్‌‌- టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్రెడ్డి గెలుపొందారు. బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సమీప పీఆర్‌టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై ఏవీఎన్రెడ్డి విజయం సాధించారు. మార్చి 16వ తేదీన ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 17వ తేదీ ఉదయం నాలుగున్నర గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో మార్చి 16 సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా… ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ 50 శాతానికి మించి దక్కలేదు. అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది.మూడో స్థానంలో ఉన్న యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది.

Post Midle

Tags;BJP wins in Teacher MLC

Post Midle