కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

BJP wins Karnataka election

BJP wins Karnataka election

Date: 09/12/2019

బెంగళూరు ముచ్చట్లు:

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. 15 అసెంబ్లీ స్థానాలకు గానూ భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించింది.  కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలను కలుపుకుంటే శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 117కు చేరింది.  కాంగ్రెస్ 68, జేడీ(ఎస్) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 112. అయితే బీజేపీకి 117 ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో సీఎం యెడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు.  ఈ ఏడాది జూలైలో 17 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, జేడీఎస్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు.  దీంతో కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పతనమై.. యెడియూరప్ప ప్రభుత్వం కొలువుదీరింది.

 

అంగన్వాడి వర్కర్ల ధర్నా

 

Tags:BJP wins Karnataka election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *