ఏపీలో బీజేపీ జీరో

BJP Zero in AP

BJP Zero in AP

 Date:15/09/2018
పెద్దాపురం ముచ్చట్లు
అందరికీ ఇళ్లు పధకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రాంతంలో 6 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో లక్ష ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. పెద్దాపురం నియోజకవర్గంలో 4444 ఇళ్లను ప్రారంభించామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. శనివారం అయన పెద్దాపురంలో పర్యటించారు. ఈడిశంబరు నెలాఖరుకు వంద శాతం నిర్మాణాలు పూర్తి చేస్తాం.
యువనేస్తం పేరుతో సుమారు లక్షమంది యువతకు నిరుద్యోగభృతి అందిస్తాం. చాలా కాలం నుండి నోటీసులు వస్తున్నాయని కన్నా అంటున్నారు.అది తప్పు. పదహారు మందిలో ఏ ఒక్కరికీ నోటీసులు రాలేదని అయన అన్నారు. మహారాష్ట్రలో ఈ తతంగం అంతా నడిపించి ఈ రోజు షడన్ గా నోటీసులు ఇవ్వడం జరిగింది. చంద్రబాబును అణగదొక్కాలనే ఈ ప్రయత్నమని అయన అరోపించారు. కన్నా లక్ష్మినారాణ మాటలను బట్టి ఆయన కూడా బిజేపీలో ఉంటారో లేదో తెలీదని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఏపీలో బిజేపీ జీరో అయిపోయింది. ఆ భయంతోనే చంద్రబాబు మీద మాట్లాడడం జరుగుతుందని అయన అన్నారు.
Tags:BJP Zero in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *