బిజెపి ప్రగతి భవన్ ముట్టడి..అడ్డుకున్న పోలీసులు..నేతల అరెస్ట్ 

BJP's Pragati Bhavan's invasion and arresting police

BJP's Pragati Bhavan's invasion and arresting police

Date:17/07/2018
హైదారాబాదు ముచ్చట్లు
శ్రీపీఠాధిపతి పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ బిజెపి ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ నీపద్యం లో  భాజపా కార్యాలయానికి వస్తున్న కిషన్‌రెడ్డిని నగర సీపీ బషీర్‌ బాగ్‌లోని సీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని చూడడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. భాజపా ఎమ్మెల్సీ రామచందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రగతిభవన్‌కు బయలుదేరిన ఎమ్మెల్సీ రామచందర్‌రావును తార్నాకలోని ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే ఉదయం అయన్ని గృహ నిర్భందం చేశారు.ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూపరిపూర్ణానంద స్వామిని సిటీ నుంచి బహిష్కరించడం అన్యాయమని అన్నారు. దీనిపై కలిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని అన్నారు. ఈ విషయమై నిన్న సీఎంకు లేఖ రాశానని, బీజేపీ నేతలంతా కలిసి కలవడానికి వస్తామని చెప్పామని అన్నారు. అందుకు ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, అందుకే బీజేపీ నేతలందరం నిరసన తెలిపామని కిషన్ రెడ్డి తెలిపారు.పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆయన ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని కిషర్ రెడ్డి అన్నారు. శ్రీరాముడిని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, శాంతియుతమైన పాదయాత్ర చేపట్టినందుకు నగర బహిష్కరణ చేయడం చట్ట వ్యతిరేకమని ఆయన అన్నారు. బహిష్కరణ అనేది నిజాం కాలంలో పెట్టిన పోలీస్ చట్టమని, కేసీఆర్ నిజాం పారిపాలనలా అమలు చేశారనిదీన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన తప్పును సరిద్దుకుని, స్వామికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, బహిష్కరణ వేటును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బిజెపి ప్రగతి భవన్ ముట్టడి..అడ్డుకున్న పోలీసులు..నేతల అరెస్ట్ https://www.telugumuchatlu.com/bjps-pragati-bhavans-invasion-and-arresting-police/
Tags:BJP’s Pragati Bhavan’s invasion and arresting police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *