ఈశాన్య రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా

BJP's victory in the Northeastern state election

BJP's victory in the Northeastern state election

–  సంబురాలు జరుపుకున్న నేతలు,కార్యకర్తలు
Date:03/03/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ర్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈశాన్య రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించడంతో భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు, నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ మూడింటిలో రెండు చోట్ల బీజేపీ తన స‌త్తాను చాటింది. త్రిపురలో అధికారానికి కావలిసిన పూర్తి మెజారిటీ సాధించింది.గత ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కని బీజేపీ ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకోవటం సంచలనమే. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో ప్రజలు ఈసారి బీజేపీ వైపు నిలబడ్డారు. ముఖ్యంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కారుకు త్రిపుర ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు.త్రిపురలో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం బీజేపీ కూటమి 22స్థానాల్లో గెలిచింది. 19 స్థానాల్లో ముందంజలో ఉంది. యువ నేత రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ఖాతా తెరవలేదు.2013ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాల్లో పోటీ చేయగా ఒకటి తప్ప మిగతా 49 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి.కమ్మూనిస్టు పార్టీ మాత్రం అప్పుడు 55 సీట్లకు గానూ 49 గెలుచుకుని నాలుగోసారీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 48స్థానాల్లో బరిలో దిగి 10స్థానాలతో సరిపెట్టుకుంది. ఇప్పడు ఆ పదింటిలో కూడా గెలవలేదు. ఈశాన్య రాష్టాల్లో బీజేపీ ఒక్కసారిగా ఇంత పాపులర్ కావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే హిమంత బిశ్వాశర్మ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత.2015లో ఈయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత కమల పార్టీని .. ఈశాన్య రాష్ర్టాల్లో చేరుకునేలా చేశారు. ప్రస్తుతం అస్సాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న.. హిమంత బిశ్వా శర్మ.. త్రిపుర రాష్ర్టానికి బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈశాన్య రాష్ర్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని టాప్ నేతలను ఆయన.. బీజేపీలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత స్థానిక తెగలకు చెందిన పార్టీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు త్రిపురలో హీరోగా నిలిచారు.ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్‌టీ)తో జతకట్టడం వల్ల త్రిపురలో బీజేపీ విజ‌యం చాలా సుల‌భంగా మారింది. దీంతో మానిక్ సర్కార్‌కు ఓటమి తప్పలేదు. వాస్తవానికి బిశ్వా శర్మ బయటివాడే అయినా.. త్రిపురలో ఓటర్లను బీజేపీ వైపు మళ్లించడంలో సక్సెస్ సాధించారు. రామ్ మాధవ్, సునిల్ డియోరా, బిప్‌లాబ్ డెబ్ లాంటి స్థానికులతో కలిసి ఈశాన్య రాష్ర్టాల్లో కీలక రోల్ ప్లే చేశారు.కాగా తెలంగాణ రాష్ట్ర  రాజదాని హైదరాబాద్ లో బిజెపి నేతలు పాఎర్తి కార్యాలయం లో సంబరాలు చేసుకున్నారు.రంగులు చల్లుకొని స్వీట్లు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలోపార్టీ ఎం ఎల్ ఏ లు కిషన్రెడ్డి, రాజ సింగ్,ఎం ఎల్ సి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
Tags: BJP’s victory in the Northeastern state election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *