బీజేవైఎం అందోళన

రంగారెడ్డి ముచ్చట్లు:

 

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రేవేల్లి రాజు ఆధ్వర్యంలో  ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే తీసుకువచ్చి ప్రయివేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపును నియంత్రించాలని,అధిక ఫీజు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఉప్పల్ శ్రీ చైతన్య పాఠశాల  ముందు ధర్నా నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఉప్పల్ నియోజకవర్గం బీజేవైఎం నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు.కార్యక్రమం లో రేవెళ్ళి రాజు మాట్లాడుతూ ప్రవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారన్నారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కొరకు జస్టిస్ తిరుపతిరావు కమిషన్ ను వేసినా కూడా విద్యా సంస్థలు ఆ కమిషన్ ను తుంగలో తొక్కి 50 నుంచి 80 శాతం వరకు ఫీజులు పెంచి  విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కుపిండి వసూలు  చేస్తుంటే ఈ చేతగాని ప్రభుత్వం సోయి లేకుండా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు వెనుకబడిన వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆయా సంస్థల్లో 25 శాతం వరకు ఉచితంగా విద్యను అందించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి ఫీజుల నియంత్రణ పై చర్యలు తీసుకోవాలని లేకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తెలంగాణ సంపత్, అధికార ప్రతినిధి  చెన్నోజు హరీష్, నాని నాగరాజు గౌడ్, వర్కల రాజేందర్ గౌడ్,శ్రీనివాస్ ముదిరాజ్,నాసు సతీష్, మహేశ్వర్ రెడ్డి,దత్తసాయి, శ్రీనివాస్,ఆకుల రిశికేష్, నవీన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, గోరిగే శ్రీకాంత్, రామ్ బాకీ, ఆడెపురమేష్, గుండె పునెంధర్,భవిష్ ప్రసాద్, రమేష్, సాయినాద్, ప్రభాకర్,అభిరాం రెడ్డి  నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: BJYM concern

Leave A Reply

Your email address will not be published.