బీజేవైఎం ధర్నా

హైదరాబాద్  ముచ్చట్లు :
కష్ట కాలం లో కాసుల కోసం తల్లిదండ్రులను కష్టపెట్టి ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల పై చర్యలు కూకట్ పల్లి లోని నారాయణ విద్యాసంస్థల ముందు బీజేవైఎం కార్యకర్తలు  ధర్నా కి దిగారు.  జి.ఓ నెంబర్ 46 ను ప్రభుత్వం విడుదల చేసిన కార్పొరేటర్ స్కూల్స్ ,కాలేజీ లు వారికి ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కార్పొరేట్ విద్యాసంస్థలు టిఆర్ఎస్ నేతల కనుసన్నుల్లో నడుస్తున్నాయి అని ఆరోపించారు. ఈ కరోనా కాలంలో తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి యాజమాన్యాలు, వసూలు చేసిన ఫీజులను అటు అధ్యాపకులకు సరైన జీవితం అందించకుండా సగం జీతం మాత్రమే అందించి యాజమాన్యాలు డబ్బులు దండుకుంటున్నారు అని  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా జీవో నెంబరు 46 ను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తును ఆదుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ధర్నా చేస్తున్న బి.జే.వై.యం నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:BJYM Dharna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *