పీసీసీ చీఫ్ గా నల్లారి…

తిరుపతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అడుగులు వేస్తున్నారా? అందుకే ఏపీ మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సంగతి అటుంచి కనీసం ఉనికినైనా కాపాడుకోవలసిన అవసరం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం   నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అందుకు అనువైన వ్యక్తిగా గుర్తించారని పరిశీలకులు అంటున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైన పార్టీ అనడంలో సందేహం లేదు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీకి రాష్ట్రంలో నాయకులే లేకుండా పోయారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కూడా నామమాత్రంగా మిగిలిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిథ్యమే లేకుండా పోయింది.అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి ఏపీ ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా 2014 ఎన్నికలలో సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికల బరిలో దిగారు. అయితే ఎన్నికలలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు అది వేరే సంగతి. ఆ తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా దాదాపు కనుమరుగైపోయారనే చెప్పాలి. కానీ ఇప్పుడు హస్తిన నుంచి పిలుపు రావడంతో ఆయన మళ్లీ రాజకీయాలలో లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.విభజన అనంతరం కాంగ్రెస్ ను వీడి సమైక్యాంధ్ర కోసం సొంత పార్టీ పెట్టుకున్నా, ఇప్పటి వరకూ ఆయన మరో పార్టీలో చేరడం కానీ, కాంగ్రెస్ హై కమాండ్ పై విమర్శలు గుప్పించడం కానీ చేయని కారణంగానే సోనియాగాంధీ ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని భావించినట్లు ప్రచారం అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను నల్లారికి అప్పగించే యోచనలో హై కమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు.

 

Tags: Black as PCC chief …

Leave A Reply

Your email address will not be published.