ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..

ఛత్తీస్‌గఢ్‌ ముచ్చట్లు:

ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు.ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Tags:Blast in Ghoram gunpowder factory in Chhattisgarh kills 17.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *