ప్రజలకు శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆశీస్సులు

Blessings of Sri Aryamprakash Sachchidananda Saraswathi Swami to the public

Blessings of Sri Aryamprakash Sachchidananda Saraswathi Swami to the public

Date:19/09/2019

పుంగనూరుముచ్చట్లు:

కర్నాటక చిక్కమంగళూరు హరిహరమఠం పీఠాధిపతి శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి గురువారం పట్టణ ప్రజలకు ఆశీస్సులు అందజేశారు. పట్టణంలోని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని హరహరమఠంలో శ్రీ రామానందతీర్థ స్వామివారి ఆరాధాన కార్యక్రమాలను మఠంలో స్వామిజి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి పూజలు నిర్వహించి, ప్రజలను నేరుగా కలిసే అవకాశం కల్పించారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామి స్వయంగా తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సందర్భంగా స్వామి మాట్లాడుతూ పుంగనూరు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు, ఆర్‌ఐ రాంప్రసాద్‌, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు రామనాథశర్మ, డాక్టర్‌ రమణరావు, మదుకుమార్‌శర్మ, రామకృష్ణ, మురళి, కోదండరామయ్య, సుబ్బరావు, కుమార్‌, సుమన్‌, రవితో పాటు బ్రాహ్మణ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

కమలంలో కలవరం 

Tags: Blessings of Sri Aryamprakash Sachchidananda Saraswathi Swami to the public

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *