196 doctors die of corona infection

కరోనా మృతదేహాలు అడ్డుకోవడం నేరం

Date:3/08/2020

ఏలూరు ముచ్చట్లు:

కరోనా వ్యాధి ద్వారా మృతి చెందిన మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయకుండా అడ్డగించడం నేరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు చెప్పారు సోమవారం జిల్లా జడ్జి బంగ్లా లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు మృతుల కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తే ఐపీసీ  297 మరియు 341 మరియు 147 మరియు 148 సెక్షన్ ల ప్రకారం   సంబంధిత వ్యక్తులు శిక్షకు అర్హులని చెప్పారు గ్రామాల్లో పట్టణాల్లో కో విడ్ మృతులను దహన సంస్కారాలు నిర్వహించరాదని పలు చోట్ల గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మృతుడి బంధువులు రెవిన్యూ మున్సిపాలిటీ న్యాయసేవాధికార సంస్థ అధికారుల దృష్టికి తీసుకురావాలని లేదా సెల్ నెంబర్ 9 5 1 5 3 85 9 5 5 ల్యాండ్ నెంబర్ 0 8 8 1 2 2  2 4 5 55 నెంబర్ గాని తెలియజేస్తే సంబంధిత వ్యక్తుల పై కేసు నమోదు చేయడం జరుగుతుందని  జిల్లా జడ్జి చెప్పారు బ్రతికి ఉన్న మనిషికి సామాజిక హక్కులు ఉన్నాయని అదే విధంగా మరణించిన వ్యక్తులు కూడా హక్కులు వర్తిస్తాయి అని ఆయన చెప్పారు బ్రతికినంత కాలం మనిషి మంచితనానికి ఎటువంటి విలువలు ఉంటాయో మరణించిన తర్వాత కూడా మనిషి మంచితనం శాశ్వతంగా  భూమిపై ఉంటుందని అన్నారు ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ముఖ్యంగా మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని చేతికి గ్లౌజులు శానిటేషన్ ద్వారా చేతులు శుభ్రం చేసుకోవాలని తద్వారా 90% కరోనా వ్యాధి రాకుండా అవకాశం ఉంటుందని ఆయన అన్నారు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాధి ని అంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

పాజిటివ్ పేషెంట్ల లో ధైర్యం నింపండి

Tags:Blocking corona bodies is a crime

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *