అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా టీటీడీ మహిళా ఉద్యోగుల రక్తదానం
తిరుపతి ముచ్చట్లు:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కేంద్రీయ ఆసుపత్రిలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జేఈవో లు సదా భార్గవి, వీర బ్రహ్మం, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మురళీ ధర్ , సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ,ఆర్ఎంవో డాక్టర్ నర్మద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: Blood donation by TTD women employees on the occasion of International Women’s Day
