ముస్లింవెల్ఫేర్‌ సంఘంచే రక్తదాన శిబిరం

Blood donation camp by the Muslimwealth Federation

Blood donation camp by the Muslimwealth Federation

Date:19/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ముస్లింవెల్ఫేర్‌ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ సాయినాథ్‌ ముఖ్య అత్యిధిగా హాజరై, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముస్లిం వెల్ఫేర్‌ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

 

ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. స్థానిక అధ్యక్షుడు నౌషాద్‌ మాట్లాడుతూ ప్రతియేటా నిర్వహించేలా రీతిలో రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. సుమారు 100 మంది రక్తదానం చేశారన్నారు. ఆపదలో ఉన్న వారికి అందించేందుకే రక్తదాన శిబిరం చేపట్టామన్నారు. ఈ సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపుతామన్నారు.

 

ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రవీన్‌, ప్రధాన కార్యదర్శి అయూబ్‌ఖాన్‌, సున్నిఅంజుమన్‌ కమిటి ప్రతినిధులు ఇనాయతుల్లాషరీఫ్‌, సికిందర్‌సాబ్‌, బాబు, అంజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రోజా వినూత్న ప్రదర్శన

Tags: Blood donation camp by the Muslimwealth Federation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *