Natyam ad

పోలీసుల అధ్యర్యంలో రక్తదాన శిబిరం

గూడూరు ముచ్చట్లు:

 


గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు అమరవీరుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు పోలీసులు ,  యువతీ యువకులు , రక్తదానం చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి రక్తదాతలను అభినందించారు . ఈ సందర్భంగా గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అనేక రోడ్డు ప్రమాదాలు ప్రసవ సమయంలో రక్తం లేక ఎంతోమంది చనిపోతున్నారు అని రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలపవచ్చని తెలిపారు . విద్యార్థులు వారి కళ్ళ ఎదుట జరుగుతున్న నేరాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిఐలు దశరథ రామారావు ,హజరత్ బాబు ,వెంకటేశ్వరరావు  ,ఎస్సైఅంజిరెడ్డి,కళాశాల ఏవో రామయ్య ,డాక్టర్లు పాల్గొన్నారు .

 

Tags; Blood donation camp under police supervision

Post Midle
Post Midle