గర్భిణీకి హెచ్ఐవీ రక్తం: దాత ఆత్మహత్య

Blood donation to HIV blood donor for pregnant woman

Blood donation to HIV blood donor for pregnant woman

Date:31/12/2018
చెన్నై ముచ్చట్లు:
 ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణీకి రక్త దానం చేసిన దాత పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చికిత్సకు వచ్చిన గర్భిణికి హెచ్‌ఐవీ వైరస్‌ ఉన్న రక్తం ఎక్కించడంతో ఆమె ఈ వ్యాధి బారిన పడింది. కాగా.. ఈ ఘటనలో వివరాల్లోకి వెళితే..రామనాథపురం జిల్లాకు చెందిన ఓ 19ఏళ్ల యువకుడు గత నవంబరులో శివకాశి ప్రభుత్వాస్పత్రిలో రక్తదానం చేశాడు. అక్కడ సిబ్బంది హెచ్‌ఐవీ పరీక్షలు చేయకుండానే అతడి రక్తాన్ని సత్తూర్‌ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ గర్భిణికి ఈ రక్తం ఎక్కించారు. ఇదిలా ఉండగా.. రక్తాన్ని దానం చేసిన ఆ యువకుడు ఇటీవల ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో అతడికి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.దీంతో అతడు వెంటనే శివకాశి ఆసుపత్రికి వెళ్లి సమాచారమిచ్చాడు. అయితే అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణికి ఎక్కించినట్లు తెలిసింది. ఆమెకు కూడా వైద్యపరీక్షలు నిర్వహించగా.. హెచ్‌ఐవీ సోకినట్లు తేలింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిండం వల్లే ఈ తప్పిదం జరిగినప్పటికీ.. తన వల్ల ఓ మహిళకు హెచ్‌ఐవీ సోకడంతో సదరు యువకుడు మనస్తాపానికి గురయ్యాడు.గత గురువారం ఇంట్లో ఎలుకల మంది తిని ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే అతడిని మధురై రాజాజీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు.
Tags:Blood donation to HIV blood donor for pregnant woman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed