రక్తదాత  మురిగిపూడి సతీష్ కుమార్ కు ఘన సన్మానం

నెల్లూరుముచ్చట్లు :

 

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 80 సార్లు రక్తదానం చేసిన రక్తదాత మురిగిపూడి సతీష్ కుమార్ను పినాకిని వెల్ఫేర్ అసోసియేషన్ సోమవారం ఘనంగా సన్మానించింది. స్థానిక బాలాజీ నగర్ ప్రాంతంలో ఉన్న గీతా మయి వృద్ధుల ఆశ్రమం నందు ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాత లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి  రక్తదానం చేయాల్సి ఉందన్నారు.
జె.డి.ఫౌండేషన్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో  నెల్లూరు బాలాజీ నగర్ లోని గీతామయి వృద్ధుల ఆశ్రమం నందు ప్రపంచ రక్తదాతల  దినోత్సవం సందర్భంగా 80 సార్లు రక్తదానం చేసిన రక్తదాత మురిగిపూడి సతీష్ కుమార్ ను ఘనంగా సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  రక్తదానంపై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయని తమ అభిప్రాయాలు వెల్లడించారు. రక్తదాతల నుండి ఒకసారి ఒక యూనిట్ అంటే 350 మిల్లీ లీటర్ల రక్తం మాత్రమే సేకరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని పాండు, మురళీ మోహన్ రాజు, దగ్గుపాటి రాధా కృష్ణ, తూములూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Blood donor Murigipoodi is a solid tribute to Satish Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *