ఎల్ ఆర్ ఎస్ పేరుతో ప్రజల నెత్తిన గుదిబండ

 

Date:23/09/2020

-సంవత్సరాల క్రితం కొనుక్కున్న  స్థలాలపై ఎల్ఆర్ఎస్ భారం కాదా

 

-బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు

 

దశాబ్దాలుగా స్థలాలు కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతితో,   బ్యాంకు రుణాలతో  ఇల్లు కట్టుకొని నివసిస్తున్న  మధ్య తరగతి, పేద ప్రజల నెత్తిన  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుదిబండ పెట్టిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ విమర్శించారు.  మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎల్ ఆర్ ఎస్ పథకం,   పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంపై పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ 2014 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెరాస ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానని వాగ్దానం చేసిందని,   నేటి వరకు నేటి వరకు జిల్లాలో  ఏ ఒక్క పేద కుటుంబానికి బిల్లు ఇచ్చిన దాఖలా  లేదని విమర్శించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  తన ఎన్నికల  నలుగురు ఉన్న కుటుంబం ఒకే గదిలో నివసిస్తున్నారని,  అటువంటి దుస్థితి లేకుండా ప్రతి పేద కుటుంబానికి రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తానని వాగ్దానం చేసి విఫలమయ్యారన్నారు.  నేటి వరకు జిల్లాలో ఏ ఒక్కరికి ఈ పథకం వల్ల ఉపయోగం లేదని,  కేవలం తెరాస పార్టీకి ప్రచారంగానే పనికొస్తుందని,  తక్షణమే రెండు పడక గదుల ఇల్లు నిర్మించి పేద ప్రజలకు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా స్థలాలు కొనుక్కొని,   ప్రభుత్వ అనుమతులతో,   బ్యాంకు రుణాలతో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజల నెత్తిన ఎల్ ఆర్ ఎస్  పేరుతో పెద్ద గుదిబండ పెట్టారని,  ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఇల్లు కట్టుకున్న ప్రజల నుండి ఎల్ ఆర్ ఎస్ పేరుతో తిరిగి డబ్బు వసూలు చేస్తూ ప్రభుత్వం దోపిడీకి  పాల్పడుతోందన్నారు.

 

ఎప్పుడో కొనుక్కున్న స్థలాలపై ప్రజలు తిరిగి సగం ధరకు పైగా ప్రభుత్వానికి  జరిమానాగా చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  అనుమతి లేని లేఔట్లకు ప్రభుత్వ అధికారులే బాధ్యత అని,  వారిని వదిలేసి  ప్రజలను శిక్షించడం భావ్యమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  అధికారులు నియమ నిబంధనలు పాటించక పోవడం ప్రజల తప్పా అని,   వారిపై ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడీని ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజల భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం రాజ్యాంగానికి విరుద్ధం అని,  తక్షణమే ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేసి ప్రజలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఇలా ప్రధాన కార్యదర్శులు  యడ్లపల్లి శ్రీనివాస్ కుమార్,  భూక్య సీతారాం నాయక్,  ఉపాధ్యక్షులు డాక్టర్ వేమరాజు అరుణ,  కార్యదర్శులు గుగులోతు రమేష్ బాబు,   నోముల రవి రమేష్,  మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మోకాళ్ళ నాగ స్రవంతి,  జిల్లా నాయకులు ఎర్రం రాజు,  జంప సీతారామరాజు, కొత్తగూడెo, పాల్వంచ  పట్టణ అధ్యక్షులు  లక్ష్మణ అగర్వాల్, మను పూరి ప్రభాకర్,  మండల అధ్యక్షులు రాయుడు నాగేశ్వర్రావు,  దాట్ల రామకృష్ణంరాజు  తదితరులు పాల్గొన్నారు.

 

తిరుపతిలో టీడీపీ, బీజేపీ నేతల గృహానిర్భంధం

Tags;Bloody mound of people by the name of LRS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *