బ్లూ బుక్’ రూల్స్… నిబంధనలు
‘ఛండీఘడ్ ముచ్చట్లు:
పంజాబ్‌లో ప్రధాని మోదీ సెక్యూరిటీలో ఘోర వైఫల్యం. దేశవ్యాప్తంగా సంచలనం. తాను ప్రాణాలతో తిరిగి వెళ్తున్నందుకు మీ సీఎంకు థ్యాంక్స్ చెప్పండంటూ మోదీ వ్యాఖ్యానించడం.. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ సైతం ఘటనపై ఆరా తీయడం.. విషయ తీవ్రతకు నిదర్శనం. ఇంతకీ భారత ప్రధానికి ఎలాంటి భద్రత కల్పిస్తారు? ‘బ్లూ బుక్’ రూల్స్ ఏం చెబుతున్నాయి? పీఎంకి సెక్యూరిటీ కల్పించే ఎస్పీజీ స్పెషాలిటీ ఏంటి? భారత ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణలో ఉంటారు. 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం 3,000 మంది సుశిక్షితులైన కమెండోలు ఉన్నారు. ప్రధాని, ఆయన ఉండే ఇల్లు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం వీరి డ్యూటీ. ఎస్పీజీ కమెండోస్కి అత్యంత కఠినమైన శారీరక శిక్షణ, కచ్చితమైన గురితో గన్ కాల్చడం, కమ్యూనికేషన్లు ట్రేస్ చేయడం.. వంటి పలు అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. వీరినే బ్లాక్ క్యాట్ కమెండోస్ అని కూడా అంటారు. చంద్రబాబుకు సైతం ఎస్పీజీ రక్షణ ఉందఎస్పీజీ సిబ్బంది వింటర్లో సూట్స్, గాగుల్స్ ధరించి ప్రధాని చుట్టూ ఉంటారు. టూవే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు అందించే ఇయార్ పీస్‌లు, గ్లోక్-17 హ్యాండ్ గన్స్ వాడతారు. సమ్మర్లో సఫారీ సూట్స్ వేసుకుంటారు. అత్యాధునిక ఎఫ్ఎన్-హెర్స్టాల్ పీ 90 సబ్మిషిన్ గన్లు, ఫోల్డబుల్ బాలిస్టిక్ షీల్డ్ వాడతారు. ప్రధాని భద్రతకు సగటున రోజుకు రూ.1.6 కోట్లు ఖర్చు అవుతుంది.హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ‘బ్లూ బుక్’ను అనుసరించి ప్రధానికి సెక్యూరిటీ కల్పిస్తారు. బ్లూ బుక్ రూల్స్ ప్రకారం కేంద్ర ఏజెన్సీలు, ఆయా రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తారు. ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందు ఎస్పీజీ అధికారులు, ఆయా రాష్ట్ర పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో, జిల్లా కలెక్టర్‌తో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లియేజాన్ డ్రిల్ నిర్వహిస్తారు. లోపాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. అంతా ఓకే అనుకుంటే..
రూట్ మ్యాప్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు.ప్రధాని పర్యటనలో హఠాత్తుగా వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకొని మరో ప్లాన్-బి ప్రణాళిక కూడా రెడీగా ఉంచుకుంటారు. ప్రధాని హెలికాప్టర్లో ప్రయాణించలేని పరిస్థితులో.. రోడ్డు మార్గంలో వెళ్లేందుకు రూట్ రెడీ చేస్తారు. ప్రధాని హెలికాప్టర్ వాడాలి అంటే.. కనీసం కిలోమీటర్ దూరం వరకూ స్పష్టంగా కనిపించేలా వాతావరణం ఉండాలి. అయితే, శీతాకాలంలో వాతావరణం అంత క్లియర్‌గా ఉండదు కాబట్టి.. ఈ సీజన్లో పీఎం పర్యటనకు రోడ్డు మార్గాలనే ఎక్కువగా వాడుతుంటారు. రోడ్ క్లియరెన్స్, ఇంటెలిజెన్స్ సమాచారం, వేదిక భద్రత, ప్రజల రద్దీని కంట్రోల్ చేయడం లాంటివి రాష్ట్ర పోలీసులే చూసుకుంటారు. ప్రధాని ర్యాలీలు, రోడ్‌షోలు సవాళ్లతో కూడుకున్న పనులు. ఎస్పీజీ, రాష్ట్ర పోలీస్ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారు. ర్యాలీల సమయంలో ప్రధాని చుట్టూ సాధారణ దుస్తుల్లో సామాన్య పౌరుల్లా కూడా భద్రతా సిబ్బంది మోహరించి ఉంటారు. ఇలా అన్ని రకాలుగా, అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. పంజాబ్‌లో పీఎం మోదీ కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై 20 నిమిషాల పాటు ఆగిపోవడం అత్యంత అసాధారణ విషయం. అందుకే, బ్లూ బుక్ నిబంధనలను మరోసారి పరిశీలించి.. మరింత మెరుగు పరచాల్సిన ఆవశ్యకత ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Blue Book ‘Rules … Terms