మీసేవ కేంద్రాలలో బోర్డులు ఏర్పాటు చేయాలి

Boards should be set up in service centers

Boards should be set up in service centers

– తహశీల్ధార్‌ వెంకట్రాయులు

Date:22/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు మీసేవా కేంద్రాలలో ప్రతి ఒక్కరు సేవరుసుములు, పరిష్కారము, సేవలు గురించి నిర్ణీత బోర్డులు తక్షణం ఏర్పాటు చేయాలని తహశీల్ధార్‌ వెంకట్రాయులు ఆదేశించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీసేవా కేంద్రాల నిర్వాహకులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ మాట్లాడుతూ మీసేవా కేంద్రాలలో చెల్లించాల్సిన రుసుముకు మించి అదనంగా డబ్బులు వసూలు చేయరాదన్నారు. అలా చేసే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మీసేవా కేంద్రాలకు వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు ఆలస్యం లేకుండ కార్యాలయాలకు పంపాలని ఆదేశించారు. కేంద్రాలలో వినతిపత్రాలు ఉంచుకోవడం, ఆలస్యం చేసిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే సేవా కేంద్రాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఏదైన సమస్యలు ఎదురైతే తక్షణ తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో నిర్వాహకులు , రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఓటర్ల సర్వేకు తప్పుడు సమాచారం ఇవ్వద్దు

Tags: Boards should be set up in service centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *