పడవ బోల్తా: ఆచూకీ లభించని వారికోసం గాలింపు ముమ్మరం

Boat boat: Seeking for those who do not have the whereabouts

Boat boat: Seeking for those who do not have the whereabouts

 Date:17/07/2018
యానం ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక వద్ద శనివారం పడవ బోల్తా ఘటనలో గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి మంగళవారానికి 4 రోజులవుతున్నా మిగతా ఐదుగురు విద్యార్థినుల జాడ కానరాకపోవడంపై వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదం జరిగిన పశువుల్లంక నుంచి యానాం మీదుగా గౌతమీ నది పొడవునా గాలింపు బృందాలు జల్లెడ పడుతున్నాయి. నదికి ఇరువైపుల అంచుల్లో మృతదేహాలు చిక్కుకునే అవకాశం ఉండటంతో వెతుకుతున్నారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్పీ, నేవీ, పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ, మత్స్యకారులు పాల్గొన్నారు. యానాం శివారు సావిత్రినగర్, బైరవపాలెం సముద్ర తీరంలో కుడా గాలింపులు జరుగుతున్నాయి.  మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటాయోమోనని అనుమానిస్తున్నారు. సముద్రం లో మృతదేహాలను  చేపలు తినేసి ఉంటాయని కుడా అనుమానం  వ్యక్తం అవుతున్నాయి. సముద్రంలో ఓఎస్జీసీ  గ్రీడ్ ఉండడంతో గాలింపు చర్యలకు ఆటకం కలుగుతోంది. గాలింపులలో గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమవుతున్నాయి. మంత్రి చినరాజప్ప భైరవపాలెం తీరంలో సిబ్బంది చేపటుతున్న గాలింపు చర్యలను పర్యవేక్షించారు. మంత్రి చినరాజప్ప కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే బుచ్చిబాబుతో కలిసి సముద్రంలోకి వెళ్లి పర్యవేక్షించారు. గల్లంతైన  విద్యార్థినుల ఆచూకీ కోసం నేవీదళ సిబ్బంది హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పడవ బోల్తా: ఆచూకీ లభించని వారికోసం గాలింపు ముమ్మరం https://www.telugumuchatlu.com/boat-boat-seeking-for-those-who-do-not-have-the-whereabouts/
Tags:Boat boat: Seeking for those who do not have the whereabouts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *