బోడే  ప్రసాద్ ఆఫీసు చుట్టూ పాములే

Date:17/04/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆ ఎమ్మెల్యే కార్యాలయాన్ని పాములు వెంటాడుతున్నాయి. వరసబెట్టి రోజూ పాములు వస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అవును.. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కార్యాలయంలో పాములు కలకలం రేపుతున్నాయి. ఆఫీస్ గదిలోకి మూడు రోజుల కిందట అత్యంత విషపూరితమైన తాచుపాము చొరబడింది. ఆ మరుసటి రోజే పెద్ద జెర్రిపోతు వచ్చింది. ఆ తర్వాతి రోజు కట్ల పాము కలకలం సృష్టించింది. దీంతో వివిధ పనుల నిమిత్తం అక్కడికి వచ్చే ప్రజలకు సర్పాల భయం పట్టుకుంది.ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కట్ల పాము ప్రత్యక్షమైంది. ఆ సమయంలో అక్కడ ఉన్న పలు గ్రామాలకు చెందిన ప్రజలు పెద్దగా కేకలేశారు. దీంతో భీతిల్లిన ఆ సర్పం ఏకంగా కార్యాలయం లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న అంకాలు అనే కూలీ దాన్ని పట్టుకొనే ప్రయత్నం చేయగా.. అది అతడి ముంజేతిపై కాటు వేసి పారిపోయింది. అక్కడే ఉన్న మిగతావారు పామును చంపే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చివరకు పాము కాటు నొప్పిని పంటి బిగువన ఒడిసిపట్టి అంకాలే దాన్ని పట్టుకొని చంపేయడం గమనార్హం. అనంతరం అతణ్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో తరచూ విష సర్పాలు ప్రత్యక్షం అవుతుండడంతో వివిధ పనులపై వచ్చే ప్రజలతో పాటు, కార్యాలయ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు.
Tags: Bodi Prasad is a snake around the office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *