ఇంటికి చేరిన మృతదేహాలు
సికింద్రాబాద్ ముచ్చట్లు:
నూతన సంవత్సర వేడుకల కోసం విశాఖ బీచ్ కి వెళ్లి నీటిలో మునిగి చనిపోయిన ముగ్గురు యువకులను బేగంపేట రసూల్ పుర లోని వారి నివాస ప్రాంతాలకు పోలీసులు తరలించారు.. గత రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన అందరినీ ఎంతగానో తీవ్రంగా కలచివేసింది.. ఈ ఘటనలో ఏడు మంది విహార యాత్రకు వెళ్లగా అందులో లో శివ కుమార్ శివ అజీజ్ మరణించడంతో వారి మృతదేహాలకు విశాఖ లోని పోస్టుమార్టం నిర్వహించి ఈరోజు ఉదయం బేగంపేటకు తీసుకువచ్చారు.. ఈ ఘటనతో ఒక్కసారిగా బేగంపేట్ రసూల్ పుర లో విషాద ఛాయలు అలుముకున్నాయి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు వారి మృతదేహాలను చూసేందుకు ఎగబడ్డారు.. కుటుంబ సభ్యులు బంధువులు రోదనలతో రసూల్ పుర రోదనకు గురైంది.. స్థానికులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.. శివకుమార్ స్వస్థలమైన చేగుంట, సిద్దిపేటకు చెందిన శివలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అంత్యక్రియలు జరిపి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Bodies reaching home