సర్పంచ్ భర్తకు దేహశుద్ధి

కరీంనగర్ ముచ్చట్లు :

జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ భర్త చావుదెబ్బలు తిన్నాడు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి సర్పంచ్ భర్త వెళ్ళగా సదరు మహిళ భర్తతో పాటు స్థానికులు దేహశుద్ధి చేశారు.‌ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధర్మపురి మండలం రాజారాం గ్రామ పంచాయతీ పరిధిలోని కోరండ్లపల్లెలో సర్పంచ్ భర్త అశోక్ ఓ మహిళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త, స్థానికులతో కలసి అతన్ని చితకబాదారు.అయితే రైతుబంధు డబ్బుల విషయం మాట్లాడేందుకు ఇంటికి రమ్మని తానే పిలిచానని సదరు మహిళా చెబుతుండగా అనుమానంతో సర్పంచ్ భర్త అశోక్ పై తనపై అకారణంగా దాడి చేసి కొట్టారని సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. వేరే ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరో వైపు మహిళా సర్పంచ్ పుట్టింటికి వెళ్ళిపోవడంతో ఉప సర్పంచ్ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Body cleansing for sarpanch husband

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *