Natyam ad

బొజ్జల సుధీర్ తన స్థాయి తెలుసుకోవాలి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:


పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని  విమర్శించే స్థాయి బొజ్జల సుధీర్ రెడ్డికి లేదు,మీ స్థాయి ఏంటో తెలుసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  విమర్శిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే  బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. మీ తండ్రి పార్టీలతో సంబంధం లేకుండా పేదలకు పనులు చేశారా ? 30 సంవత్సరాలు శ్రీకాళహస్తినీ పాలించిన మీరు పేదలకు నిజంగానే పనులు చేస్తుటే ఈరోజు ఇంతమంది పేదలు ఉండేవారు కాదు. ఎన్నికల సమయానికి రావడం ప్రజలను మోసం చేయడం హైదరాబాదుకి వెళ్ళిపోయి మళ్ళీ మీ వ్యాపారాలు చూసుకొని వేల కోట్లు సంపాదించడం ఇది మీ దినచర్య. జన్మభూమి కమిటీ పేర్లతో పేద ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ మీరు మీ కార్యకర్తలు కోట్లకు కోట్ల సంపాదించేసి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేసేసారు. నేడు జగనన్న వాలంటీర్ల ద్వారా నేరుగా పేద ప్రజల చేతికి సంక్షేమ పథకాలు అందిస్తూ పేదల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు.

 

 

 

నీ సొంత గ్రామంలోని శివాలయానికి కుంభాభిషేకం చేసే దిక్కులేదు నీకు అదే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సొంతంగా శబరిమలై వరకు వెళ్లలేని పేద అయ్యప్ప భక్తుల కోసం సొంతంగా అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు.అలాగే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసావ్ చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలోని రోడ్లు డ్రైనేజీలు వేయలేదు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  తన సొంత నియోజకవర్గం కాకపోయినా కుప్పంనీ అభివృద్ధి బాటలో నిలుపుతున్నారు. ఎర్రచందనంతో వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాజేసిన నువ్వు ఈరోజు మా పెద్దయిని విమర్శిస్తునావు. శ్రీకాళహస్తిలో వీరప్పన్ వారసుడని ఎవరిని అడిగిన టక్కున బొజ్జల సుధీర్ అని చెప్తారు అది నీ స్థాయి.అదే వెంకటేశ్వర స్వామి తల్లి వకుళ మాత ఆలయం నిర్మించిన ఘనత మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికే దక్కుతుంది.అలాగే ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నావ్ ప్రపంచంలోనే నీ కన్నా పెద్ద ఇసుక దొంగ ఎవరన్నా ఉన్నారా.ఇసుక మాఫియా పేరుతో 2016లో ఏర్పేడు గ్రామం మునగలపాలెం గ్రామస్తులు 16 మందిని కడుపున పెట్టుకున్న సంఘటనను మర్చిపోయావా.

 

 

 

Post Midle

నేను గడపగడపకు వెళ్ళినప్పుడు ఇప్పటికీ ఆ గ్రామస్తులు బాధలు పడుతున్నారు వారి ఉసురు పోసుకున్న మీరు తప్పక దేవుడు శిక్ష అనుభవిస్తారు. అలాగే టిట్కో ఇళ్ల గురించి మాట్లాడుతున్నావని అన్నారు,. నాడు తెలుగుదేశం హయాంలో కమిషన్లకు కక్కుర్తి పడి పేదలకు ఇచ్చే అపార్ట్మెంట్ ఇళ్లను కూడా పూర్తిగా కాకుండా అడ్డుకున్నావు నేడు జగనన్న పేదలందరికీ సొంత ఇంటి కలలు నెరవేరుస్తూ మన శ్రీకాళహస్తి నియోజకవర్గం లో దాదాపు 25 వేల మంది పేదలకు ఇంటి స్థలాలు అందజేశారు నువ్వా మమ్మల్ని విమర్శించేది.అలాగే ప్రభుత్వ స్కూళ్లకు రంగులేస్తునారు అని చెప్తున్నావ్ అసలు నీకు బుర్ర అనేది ఉందా సుధీర్ రెడ్డి? నాడు నేడు కార్యక్రమంలో భాగంగా దేశంలోనే ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా గవర్నమెంట్ బడులను రూపురేఖలు మారుస్తున్న జగనన్నను అభినందించడం పోయి మిమ్మల్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంకా నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని విమర్శిస్తే నీ బతుకేంటో నాకు బాగా తెలుసు నువ్వు చేసే పనులన్నీ ప్రూఫ్ తో పాటు ప్రెస్ ముందు పెట్టేస్తా. రాజకీయం రాజకీయంగానే చేయాలి లేనిపోని అబద్ధపు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరించారు.

 

Tags: Bojjala Sudhir should know his level

Post Midle