టీడీపీ నేత షాకీరాలీకి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరామర్శ
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి షాకీరాలీని ఆదివారం ఆ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరామర్శించారు. షాకీరాలీ ఇటీవల గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆరోగ్యం కుదుట పడటంతో షాకీరాలీ రెండు రోజుల కిందట శ్రీకాళహస్తి పట్టణంలోని ఆయన స్వగృహానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నేరుగా షాకీరాలీ ఇంటికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. షాకీరాలీ త్వరగా కోలుకోవాలని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా కోరుకున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. షాకీరాలీని పరామర్శించిన వారిలో మైనార్టీ విభాగం నేతలు జిలానీ భాషా, షఫీ, అబ్దుల్ కరీం, సీఎస్ మస్తాన్, ఖాదర్ భాషా, అస్మత్, ఖాదర్, టీడీపీ నేతలు లోకేష్, మునిరాజా నాయుడు, దశరథాచారి, మిన్నల రవి, గోపినాథ్, సుబ్బయ్య, ఉమేష్ రావు, కాసరం రమేష్, కిట్టు, వజ్రం కిషోర్, ప్రతాప్, వినయ్, డీవీ నారాయణ, బుజ్జి తదితరులు ఉన్నారు.

Tags: Bojjala Venkata Sudhir Reddy’s advice to TDP leader Shakirali
