చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కృష్ణరాజపురం సమీపంలో బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. గాయాపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Tags; Bolero overturns…30 injured
