బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మృతి తీరని లోటు…

జగిత్యాల  ముచ్చట్లు:

భారతీయ చలన చిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ బాద్షా దిలీప్ కుమార్ మృతి కళారంగానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటని కళాశ్రీ అధినేత గుండేటి రాజు అన్నారు. గురువారం రోజున స్థానిక దేవిశ్రీ గార్డెన్ జగిత్యాల లో కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సమావేశంలో కళాశ్రీ గుండేటి రాజు మాట్లాడుతూ బాలీవుడ్ చిత్రాలలో వివిధ రకాల పాత్రలను పోషించి ప్రపంచ వ్యాప్తముగా ప్రముఖుల, విమర్శకుల ప్రశంసములను పొందిన మహానటుడు అని,1994 లో భారతీయ ప్రభుత్వం దాదాసాహెబ్ అవార్డు తో సత్కరించింది. కళా సంస్థల ప్రతినిధులు చిత్రపటానికి పూలమాల వేసి, మౌనం వహించి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, గాణకోకిల ఎలిగేటి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శ్యాం సుందర్, గొల్లపెల్లి శ్రీరాములు గౌడ్, ఎలుగందుల రవి, మచ్చ రవీందర్,  గాయకుడు అభి, రాగుల పరుశురాం గౌడ్,  భానుక మహేష్, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Bollywood actor Dilip Kumar’s death is a huge loss …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *