సయేషాకు బాలీవుడ్ ఆఫర్లు

Bollywood offers to Saiasha

Bollywood offers to Saiasha

 Date:17/07/2018
ముంబై ముచ్చట్లు:
తెలుగులో తను ఇంట్రడ్యూస్ అయిన తొలి సినిమా ‘అఖిల్’కాస్తా ఫ్లాప్ కావడంతో సయేషాకు తెలుగునాట పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఒక భారీ సినిమాలో నటించింది. అయితే అది కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలా వరస పరాజయాలు ఇబ్బంది పెట్టినా తమిళంలో మాత్రం ఈ అమ్మడికి వరస అవకాశాలు లభిస్తూ ఉన్నాయి.తాజాగా కార్తీ హీరోగా నటించిన ‘చినబాబు’లో సయేషా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పల్లెటూరి పిల్లగా ఆకట్టుకుంది ఈ భామ. ఈ సినిమా పాజిటివ్ టాక్ పొందింది. దీంతో సయేషాకు మరిన్ని అవకాశాలు రావొచ్చు. అయితే ఇంతకు ముందే ఈమెకు తమిళనాట వేరే సినిమా ఛాన్సులు దక్కాయి. వాటిల్లో ఒకటి ‘గజినీకాంత్’. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘భలేభలేమగాడివోయ్’ సినిమాకు రీమేక్. ఇది మాత్రమే కాకుండా విజయ్ సేతుపతి సినిమాలో కూడా సయేషా హీరోయిన్ గా ఓకే అయ్యింది. మరో సినిమా విషయంలో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు చినబాబు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సయేషా కెరీర్ తమిళంలో చక్కగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సయేషాకు బాలీవుడ్ ఆఫర్లు https://www.telugumuchatlu.com/bollywood-offers-to-saiasha/
Tags:Bollywood offers to Saiasha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *