Natyam ad

పాన్ ఇండియా మూవీ NTR 30లో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ జాన్వీ క‌పూర్‌… పోస్ట‌ర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

హైదరాబాద్  ముచ్చట్లు:



RRR వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన  ఎన్టీఆర్ ఇప్పుడు ఆస్కార్ వేడుక‌లో పాల్గొన‌టానికి అమెరికా బ‌య‌లుదేరి వెళ్లారు. ఈయ‌న నెక్ట్స్ మూవీ NTR 30పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో NTR 30 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో   ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న NTR 30కి సంబంధించి మేక‌ర్స్  మ‌రో అమేజింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సోమ‌వారం (మార్చి 6)రోజున  జాన్వీ క‌పూర్ పుట్టిన‌రోజు. ఈ సందర్బంగా మేక‌ర్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మార్చి నెల‌లోనే సినిమాను లాంఛ‌నంగా ప్రాంభించి షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేస్తారు. అభిమానులు, ప్రేక్ష‌కులు మెచ్చేలా అన్ని హంగుల‌తో సినిమాను రూపొందించి ఏప్రిల్ 5 2024న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా  NTR 30  చిత్రాన్ని తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో టాప్ టెక్నీషియ‌న్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

 

Tags: Bollywood star Janhvi Kapoor as heroine in pan India movie NTR 30… The film unit released the poster.

Post Midle
Post Midle